పక్కకు ఒరిగిన బిల్డింగ్.. పాతబస్తీలో టెన్షన్ టెన్షన్..

Update: 2023-08-19 17:12 GMT

హైదరాబాద్ పాతబస్తీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మిస్తున్న ఓ బిల్డింగ్ పక్కన ఉన్న హఠాత్తుగా ఒకవైపు కూరుకుపోయింది. దీంతో అది పక్క బిల్డింగ్ వైపు ఒరిగిపోయింది. బిల్డింగ్ లో పనిచేస్తున్న వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు.




 


కొత్తగా కడుతున్న బిల్డింగ్ ఒకవైపు ఒరిగిపోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. బిల్డింగ్ ఎప్పుడు కూలుతుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. భవనం చుట్టుపక్కల ఉన్న వారిని ఖాళీ చేయించారు. బిల్డింగ్ వల్ల ప్రమాదం పొంచి ఉండటంతో దాన్ని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.




Tags:    

Similar News