తెలంగాణ నుంచి సూట్ కేసులను ఢిల్లీకి తరలిస్తున్నారు : Kishan Reddy

Byline :  Krishna
Update: 2024-02-16 09:44 GMT

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లు అయ్యిందని విమర్శించారు. అనేక హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. కానీ గద్దెనెక్కాక వాటిని విస్మరించిందని మండిపడ్డారు. వైసీపీ నేత రామ్మోహన్ బీజేపీలో చేరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాణానికి బొమ్మ బొరుసు లాంటివని.. ఈ రెండు పార్టీలు మజ్లీస్ అడుగుజాడల్లో పని చేస్తున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీల హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని.. కుంభకోణాల పార్టీలు కుమ్మక్కు అయ్యాయన్నారు.

రాహుల్ గాంధీ ఆదేశాలతో కాంట్రాక్టర్లను బెదిరించి సూట్ కేసులు ఢిల్లీకి తరలిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. మోదీ పాలనలో దేశంలో అవినీతిని నిర్మూలించామన్నారు. భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి ఆలయం కోసం మోదీ రూ.50 కోట్లకు పైగా నిధులు కేటాయించారని చెప్పారు. మోదీ కృషితో రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు దక్కిందన్నారు. గతంలో సోనియా గాంధీ కుటుంబానికి భారతరత్నలు ఇచ్చుకున్నారు కానీ పీవీ నరసింహారావుకు ఇవ్వలేదని విమర్శించారు. పీవీ కాంగ్రెస్ వ్యక్తి అయినా భారతరత్న ఇచ్చి గౌరవించామని చెప్పారు. 

Tags:    

Similar News