కొల్లాపూర్లో టెన్షన్.. బర్రెలక్కపై దాడి

By :  Kiran
Update: 2023-11-21 14:27 GMT

కొల్లాపూర్ ఇండిపెండెంట్ అభ్యర్థి శిరీష అలియాస్ బర్రెలక్కపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు శిరీషతో పాటు పాటు ఆమె తమ్ముడిపై దాడి చేశారు. కొల్లాపూర్ పరిధిలోని పెద్ద కొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో బర్రెలక్క ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు శిరీషతో పాటు ఆమె సోదరుడిపై దాడి చేశారు.

దాడి నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బర్రెలక్క కన్నీరు పెట్టుకుంది. ఓట్లు చీల్చుతానన్న భయంతోనే తనపై దాడి చేశారని బర్రెలక్క అన్నారు. తనపై దాడి చేసింది ఏ పార్టీ వారో తెలిదయని చెప్పింది. రాజకీయాలు అంటేనే రౌడీయిజం అని ఇన్నాళ్లు విన్నానని, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నానని అన్నారు. నిరుద్యోగుల కోసం పోరాటానికి వస్తే.. తనపై ఇలా దాడులు చేస్తున్నారని విలపించారు. ఇప్పటి వరకు తనకు ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చిన తను ఎవరీ పేరు బయటపెట్టలేదన్న బర్రెలక్క.. ప్రజాస్వామ్యంలో ఇలా దాడులు చేయడం సరికాదన్నారు. దాడులు జరుగుతున్నందున పోలీసులు తమకు రక్షణ కల్పించాలని కోరారు.

Tags:    

Similar News