విద్యాశాఖలో ఫైళ్ల చోరీకి యత్నం!

Byline :  Lenin
Update: 2023-12-09 15:24 GMT

తెలంగాణ విద్యాశాఖ కార్యాలయంలో ఫైళ్ల చోరీకి విఫలయత్నం జరిగింది. గుర్తుతెలియని దుండగులు శనివారం రాత్రి బషీర్ బాగ్‌లోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ కార్యాలయంలోకి చొరబడ్డారు. 3 వ అంతస్తులోని ఓ గదిలో ఉన్న ఫైళ్లను చోరీ చేసి ఆటోలో వేసుకుని తరలించబోయారు. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం కావడంతో ఆటోను, ఫైళ్లను అక్కడేన వదిలేసిన పరారయ్యారు. విద్యాశాఖ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చాంబర్ ఈ కార్యాలయంలో ఉండేది. మరోపక్క.. మాసాబ్ ట్యాంక్‌లోని పశు సంవర్ధక శాఖ కార్యాలయంలోని మాజీ ఓఎస్డీ కల్యాణ్ కార్యాయలంలో ఫైళ్లు గల్లంతు కావడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కల్యాణ్ శుక్రవారం ఆఫీసుకు చేరుకుని ఫైళ్లు చించేసి మూటగట్టుకుని వెళ్లేందుకు ప్రయత్నించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

Tags:    

Similar News