కాళేశ్వరం కథేంటో తేలుస్తం

By :  Kalyan
Update: 2023-12-28 10:36 GMT

రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు రేపు (డిసెంబర్ 29) మేడిగడ్డ ప్రాజెక్ట్ ను సందర్శించనున్నారు. మంత్రులిద్దరు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి మేడిగడ్డ ప్రాజెక్ట్ కు బయలుదేరుతారు. అక్కడ రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వివరాలు, ప్రాజెక్ట్ కట్టడానికి అయిన ఖర్చు, జరిగిన లాభనష్టాలపై మంత్రులకు వివరణ ఇవ్వనున్నారు. ప్రాజెక్ట్ నిర్వహణకు అవసరమైన కరెంట్.. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల సమస్యలు, వాటి పరిష్కారాలపై కూడా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరం నిర్మాణ సంస్థలు, సబ్ కాంట్రాక్టర్లు, నిర్మాణంలో సంబంధం ఉన్న అందరూ.. రేపటి సమావేశంలో పాల్గొనే విధంగా మంత్రులు ఆదేశించారు.



Tags:    

Similar News