మున్నేరు వాగు పొంగిపొర్లడంతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ఆగిపోయిన రాకపోకలు తిరిగి మొదలయ్యాయి. వరద తగ్గడంతో శుక్రవారం సాయంత్రం నుంచి వాహనాలను అనుమతించారు. మొదట హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను పంపారు. పోలీసులు గట్టి భద్రత నడుమ ఒక్కో వాహనాన్ని ముందుకు పంపారు. దీంతో ఎట్టకేలకు 26 గంటల విరామం తర్వాత రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద మున్నేరు వాగు భారీ వర్షాలకు పొంగి పొర్లడంతో గురువారం సాయంత్రం నుంచి వాహనాలు భారీ సంఖ్యలో ఆగిపోయాయి. దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయాయి. చేసి వరదలోనే వాహనాలు నడపడంతో మరింత గందరోళం ఏర్పడింది. దీంతో తెలంగాణ ఆర్టీసీ మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు బస్సులు తిప్పింది.