కేసీఆర్, కేటీఆర్లకు జీవితాంతం నా పేరు గుర్తుండేలా చేస్తా: వెంకటరమణారెడ్డి

By :  Bharath
Update: 2023-12-04 15:52 GMT

తెలంగాణలో వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఒకెత్తైతే.. వెంకటరమణారెడ్డి కామారెడ్డిలో సిట్టింగ్ సీఎం, కాబోయే సీఎంలను ఓడించడం మరో ఎత్తు. దీంతో వెంకటరమణారెడ్డి పేరు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి ఎన్నికలకు ముందు కామారెడ్డిలో కేసీఆర్ నుద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఎన్నికల ముందు సభలో మాట్లాడిన కేటీఆర్.. కామారెడ్డిలో బీజేపీ తరుపున నిల్చున్నదెవరు? ఆయన పేరేంటి? అని పక్కవారిని అడుగుతారు. ‘‘నా పేరు పలకడానికి కూడా కేటీఆర్ కు సంస్కారం రాలేదు. నా పేరు తెలియదన్నట్లు మాట్లాడారు. విపక్ష పార్టీలతో, సహచర రాజకీయ నేతలతో ఎలా మాట్లాడాలో కేటీఆర్ కు తెలియదు. మర్యాదకు ఉన్న విలువేంటి? ఆత్మాభిమానానికి ఉన్న విలువేంటి? మీ దిమ్మతిరిగేలా చేయకపోతే నా పేరు వెంకటరమణారెడ్డి కాదు. మీకు జీవితాంతం నా పేరు జ్ఞాపకం ఉండేలా చేస్తా’’ అని చెప్పుకొచ్చారు. 

Tags:    

Similar News