Breaking News : కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి

Update: 2023-11-17 12:01 GMT

తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతి కాంగ్రెస్లో చేరారు. ఆమెకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవలే ఆమె బీజేపీకి రాజీనామా చేశారు. గత కొంత కాలంగా బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై ఆమె అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే పలుసార్లు పార్టీపై బహిరంగ విమర్శలు సైతం చేసిన ఆమె.. ఈ నెల 15న ఆ పార్టీని వీడింది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని.. కేసీఆర్ను గద్దె దించడం కోసమే ఆ పార్టీలో చేరుతున్నట్లు విజయశాంతి ప్రకటించారు.


Tags:    

Similar News