తెలంగాణ బీజేపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిలు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే బాటలో మరో కీలక నేత పయనిస్తున్నారు. తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతి బీజేపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. గత కొంత కాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆమె అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే పలుసార్లు పార్టీపై బహిరంగ విమర్శలు సైతం చేశారు. కాగా ఏ పార్టీలో చేరుతారన్నదానిపై విజయశాంతి క్లారటీ ఇవ్వలేదు.