బీజేపీలో చేరిన మరో ఆర్ఎస్ఎస్ కార్యకర్త.. టికెట్ కోసమేనా?

Byline :  Veerendra Prasad
Update: 2024-01-31 14:04 GMT

RSS-BJP కి ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బీజేపీలో ఉన్న అగ్రనేతలతో పాటు చాలామంది ఎమ్మెల్యేలు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినవారే. వారందరికీ పార్టీలో అపూర్వ ఆదరణ దక్కింది. తాజాగా మరో ఆర్ఎస్ఎస్ కార్యకర్త.. బీజేపీలో చేరి తన రాజకీయ జీవితాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన వినోద్ రావ్ అనే వ్యక్తి.. ఈరోజు అధికారికంగా బిజెపి కండువా కప్పుకున్నారు. ఇంతకుముందు ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వినోద్ రావును .. బీజేపీ అఫీషియల్ గా తమ పార్టీలోకి ఆహ్వానించింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల తరుణంలో తనను పార్టీలోకి ఆహ్వానించడంతో ఖమ్మం MP టికెట్ వస్తుందన్న నమ్మకంతో వినోద్ రావు కాషాయ కండువా కప్పుకున్నారు.

బీజేపీ అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్ షా వచ్చే నెల 10 వ తేదీన హైదరాబాద్‌కు రాబోతున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో.. లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 10 సీట్లు గెలిచేలా.. హైదరాబాద్ పర్యటనలో నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ఎక్కువగా సమయం లేదు. మరో 2 నెలల్లో ఎన్నికల జరిగే అవకాశముంది. అభ్యర్థుల ఎంపిక, క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే అంశాలపై అమిత్ షా నేతలతో చర్చించనున్నారు. ఇక ఇదే సమావేశంలో బీజేఎల్పీ నేతను ఎంపిక చేసే అవకాశముంది. ఉన్న ఎమ్మెల్యేల్లో రాజాసింగ్ సీనియర్. అందువల్ల ఆయన్నే బీజేఎల్పీ నేతగా ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది.

Tags:    

Similar News