విరూపాక్ష సీన్ రిపీట్.. చేతబడి చేస్తున్నారని చెట్టుకు కట్టేసి..!

Update: 2023-06-18 02:24 GMT

రాకెట్ యుగంలో కూడా మూడనమ్మకాల పేరిట దాడులు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొల్కూర్ లో కూడా అదే అమానుష్ ఘటన జరిగింది. అచ్చం విరూపాక్ష సీన్ రిపీట్ అయింది. పోలీసులు సకాలంలో స్పందించడం వల్ల.. ఆ దంపతుల ప్రాణాలు కాపాడగలిగారు. సదాశివపేట ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదయ్య, అమృతమ్మ దంపతులు చేతబడి చేస్తున్నారనే అనుమానంతో గ్రామస్తులు దాడిచేశారు.

దయాది అనే వ్యక్తి కుటుంబంలో కొందరు అనారోగ్యానికి గురికాగా.. స్థానిక పూజారికి చూపించారు. ఆ పూజారి.. ఇంటి పక్కన ఉండే వ్యక్తి మీపై క్షుద్ర పూజలు చేయించాడు. అందుకే ఇలా అవుతుందని చెప్పాడు. దాంతో దాయాది ఆ గ్రామస్తుల సాయంతో యాదయ్య దంపతులను చితక బాదాడు. ఆ తర్వాత చెట్టుకు తలకిందులుగా వేలాడ దీసి చితకబాదారు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి దంపతులను విడిపించారు. యాదయ్య దంపతులను హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందించారు. తర్వాత గ్రమస్తులకు మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించారు.

Tags:    

Similar News