Vivek Venkata Swamy : కాళేశ్వరం బ్యాక్ వాటర్ ముంపు బాధితులకు న్యాయం చేస్తాం - ఎమ్మెల్యే వివేక్

Byline :  Kiran
Update: 2023-12-09 05:32 GMT

చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం తెల్లవారుజామున కుటుంబ సమేతంగా సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వివేక్.. తెలంగాణలో నియంతృత్వ పాలన అంతమైందని.. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజా ప్రభుత్వం వచ్చిందని అన్నారు. సింగరేణిలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

కాళేశ్వరం నిర్మాణంలో భారీగా దోపిడీ జరిగిందని వివేక్ ఆరోపించారు. ఆ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. ధరణి పోర్టల్‌తో కల్వకుంట్ల కుటుంబం భూ దందాకు పాల్పడిందన్న వివేక్ మండిపడ్డారు. పదేండ్లలో ప్రజాధనం దుర్వినియోగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించినట్లు వివేక్ స్పష్టం చేశారు.




Tags:    

Similar News