పార్టీ మార్పు వార్తలపై స్పందించిన వివేక్ వెంకటస్వామి

Byline :  Kiran
Update: 2023-08-29 15:35 GMT

పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి స్పందించారు. ఆ వార్తల్ని ఆయన ఖండించారు. కొన్ని పత్రికలు తాను ఆగస్టు 30న కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానంటూ వార్తలు ప్రచురించాయని అయితే అందులో ఎలాంటి నిజం లేదని అన్నారు. తనకు పార్టీ మారే ఉద్దేశమేదీలేదని చెప్పారు. గతంలో తాను అమెరికాలో ఉన్న సమయంలో ఇలాంటి వార్తలే ప్రచారం చేశారని వివేక్ మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ అలాంటి పుకార్లే పుట్టిస్తున్నారని అన్నారు. తాను రెండు రోజులుగా పూణేలో ఉన్నానని పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజంలేనది మరోసారి స్పష్టం చేశారు.




 


ఇదిలా ఉంటే వివేక్ వెంకటస్వామి త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నారంటూ కొన్ని పత్రికలు కథనాలు ప్రచురించాయి. ఈ నెల 30న ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని వాటిలో రాశారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో వివేక్‌ వెంకటస్వామి బీజేపీలో చేరారు. 2021 నుంచి బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు.




Tags:    

Similar News