ఓటమి భయంతో ఐటీ దాడులు చేయిస్తున్నారు : వివేక్

By :  Kiran
Update: 2023-11-21 15:20 GMT

బీఆర్ఎస్, బీజేపీ కుట్రపన్ని తనపై ఐటీ దాడులకు చేయిస్తున్నాయని చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఎన్నికల్లో గెలవలేక ఇవన్నీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ వివేక్ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం ఈ తనిఖీలు కొనసాగాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన కేసీఆర్పై దాడులు జరిపే దమ్ము ఐటీకి ఉందా అని ప్రశ్నించారు.

కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసిన కాంగ్రెస్ గెలుపును అడ్డుకోలేరని వివేక్ అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 80 సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఐటీ చెల్లింపుల్లో విశాఖ ఇండస్ట్రీస్ బెస్ట్ అని.. అధికారులే విశాఖ ఇండస్ట్రీస్ ను అభినందించారని గుర్తు చేశారు. ఓటమి భయంతో బాల్క సుమన్ ఫిర్యాదు చేస్తేనే.. ఐటీ తనపై దాడులు చేసిందని ఆరోపించారు. ఈ దాడుల వల్ల తనకు ఎలాంటి నష్టం లేదన్నారు.

Tags:    

Similar News