ఓటింగ్ రోజు సెలవు సరదాకి కాదు : Governor Tamilisai

Update: 2024-01-25 06:11 GMT

సాధారణ పౌరుడిని అసాధారణ శక్తిగా చేసేదే ఓటు హక్కు అని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్ జేఎన్‌టీయూలో జాతీయ ఓటరు దినోత్సవం కార్యక్రమంలో గవర్నర్ పాల్గోన్నారు. ఎన్నికల రోజు ఇచ్చే సెలవు ఓటు వేసేందుకు మాత్రమేనని విహార యాత్రలు వెళ్లుందకు కాదని తమిసై అన్నారు. ఎన్నికల పోలింగ్ శాతం 90 నుంచి 95 శాతం పెరగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఓటు వేయడం మనందరి హక్కు అని రాష్ట్ర ఎన్నికల సంఘానికి అండగా ఉండడం నా బాధ్యత అన్నారు.

Telangana Governor Tamilisai, JNTU, National Voter's Day, Excursions,

Electoral turnout, TSCEO, Election commissioner vikas raj, telanagna goverment, cm revathreddy,Nota, brsparty, congress, telugunewsగత ఎన్నికల్లో హోమ్ ఓటింగ్ నిర్వహించిన ఎన్నికల సంఘానికి అభినందనలు తెలిపారు . విదేశాలకు వెళ్లేందుకు వీసా కోసం లైన్‌లో ఉంటారు. అలాగే ఓటు కోసం కూడా లైన్‌లో ఉండాలన్నారు. అభ్యర్థులను పూర్తిగా విశ్లేషించి ఓటు వేయాలి.” అని గవర్నర్ తమిళిసై ఓటర్లకు సూచించారు. ఓటు వేసిన తర్వాత వేసే ఇంక్ మార్కును గర్వంగా భావించాలని ఆమె సూచించారు. తాను నోటా గుర్తకు వ్యతిరేకం కాదని..అయితే బరిలో ఉన్నవారిని ఒకరిని ఎన్నకోవాలని తమిళిసై పిలుపునిచ్చారు.

Tags:    

Similar News