భద్రకాళి చెరువు విపత్తు.. భయపడొద్దన్న వరంగల్ మేయర్

Update: 2023-07-29 10:49 GMT

వరంగల్ భద్రకాళి చెరువు తెగడంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు భయం లేదని చెబుతున్నా బిక్కుబిక్కుమంటున్నారు. ముందుజాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. గండి పూడ్చేందుకు మున్సిపల్ సిబ్బంది ఇసుక బస్తాలను వేసి, అన్ని చర్యలూ తీసుకుంటున్నారని నగర మేయర్ గుండు సుధారాణి చెప్పారు. ఆమెతోపాటు కలెక్టర్ సిక్తా పట్నాయక్, మునిసిపల్ కమిషనర్ రిజ్వాన్ షేక్ గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు.

‘‘ఉదయం నుంచి మునిసిపల్, రెవెన్యూ సహా అన్ని విభాగాల అధికారులం ఇక్కడే ఉన్నాం. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం. ఎవరూ ఆందోళనపొద్దు. కేటీఆర్ గారు పరిస్థితి ఎప్పూటికప్పుడు సమీక్షిస్తూ మాకు ఆదేశాలిస్తున్నారు. మేం ఎవరికీ ఇబ్బంది రానివ్వం. గడ్డిని పూర్తిస్థాయిలో పూడుస్తాం’’ అని సుధారాణి చెప్పారు.

భారీ వర్షాలతో చెరువు నిండడంతో పోతన నగర్ వైపు ఉన్న కట్టకు 15 మీటర్ల మేర గండి పడి సరస్వతి నగర్, కాపువాడ, పోతన నగర్ తదితర కాలనీల్లో భారీ ఎత్తున నీరు చేరుకుంది. మరోపక్క నాలుగైదు రోజులుగా కురుస్తున్న వానలకు నగరంలోని వందలది కాలనీలు నీట మునిగాయి.


Tags:    

Similar News