హైదరాబాద్ నగరవాసులకు జలమండలి అలర్ట్ ప్రకటించింది. నవంబర్ 1న పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని చెప్పింది. ఈ మేరకు జలమండలి మంగళవారం కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా వాటర్ సప్లై స్కీం ఫేజు – 2 మరమ్మత్తు పనుల కారణంగా 24 గంటల పాటు పలు ప్రాంతాల్లో వాటర్ సప్లై ఉండదని చెప్పింది.
పటాన్ చెరు నుంచి హైదర్నగర్ వరకు ఉన్న పంపింగ్ మెయిన్కు భారీ లీకేజీ ఏర్పడింది. దాన్ని అరికట్టేందుకు మరమ్మతు పనులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 01 (బుధవారం) ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 2 (గురువారం) ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా నిలిపేస్తున్నట్లు జలమండలి స్పష్టం చేసింది.
నీటి సరఫరా బంద్ అయ్యే ప్రాంతాలు
ఓ అండ్ ఎం డివిజన్ – 6 : ఎర్రగడ్డ, ఎస్.ఆర్.నగర్, అమీర్ పేట్ ప్రాంతాల్లో తక్కువ ప్రెజర్తో నీటి సరఫరా
ఓ అండ్ ఎం డివిజన్ – 9 : కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, భాగ్య నగర్ కాలనీ, వసంత్ నగర్
ఓ అండ్ ఎం డివిజన్ – 15 : ఆర్సీ పురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, దీప్తి శ్రీ నగర్, మదీనాగూడ
ఓ అండ్ ఎం డివిజన్ – 24 : బీరంగూడ, అమీన్ పూర్, బొల్లారం ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. మరమ్మత్తులు పూర్తైన తర్వాత తాగునీటి సరఫరా యధాతథంగా కొనసాగుతుందని, అందుకే ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి కోరింది.