MLC KAVITHA: అప్పటివరకు మా పోరాటం ఆగదు : కవిత

By :  Krishna
Update: 2023-10-07 05:39 GMT

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లులో ఓబీసీ కోటాను చేర్చే వ‌ర‌కు త‌మ పోరాటం ఆగ‌దని ఎమ్మెల్సీ క‌విత స్పష్టం చేశారు. ఇటీవ‌ల ఆమోదం పొందిన మ‌హిళా బిల్లులో ఓబీసీ మ‌హిళ‌లను చేర్చ‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. బ్రిడ్జ్ ఇండియా సమావేశం కోసం ఆమె లండన్ వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. అన్ని వ‌ర్గాల మ‌హిళ‌ల్ని బిల్లులో చేర్చడమే అతి ముఖ్య‌మైన విష‌య‌మ‌న్నారు. కానీ అది విస్మరించిందని.. అన్ని కులాలు, అన్ని వ‌ర్గాలకు చెందిన మ‌హిళ‌ల‌ను ఈ బిల్లులో చేర్చాల‌ని డిమాండ్ చేశారు. భారత్లో ఓబీసీల వ‌ర్గం చాలా పెద్ద‌ద‌ని.. వారిని ఆ కోటాలో చేర్చే వ‌ర‌కు పోరాటం చేస్తామ‌ని చెప్పారు.

ఇవాళ లండన్‌లోని సెంట్రల్ హాల్ వెస్ట్ మినిస్టర్‌లో మహిళా రిజర్వేషన్ చట్టం, ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం అనే అంశంపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ల కోసం జరిగిన పోరాటం సహా పలు అంశాలపై కవిత ప్రసంగించనున్నారు. కాగా లండన్లో కవిత అంబేద్క‌ర్ మ్యూజియాన్ని సంద‌ర్శించారు. అంబేద్క‌ర్ ఆశ‌యాలు సీఎం కేసీఆర్ వల్ల మాత్ర‌మే నేరవేరుతాయన్నారు.

Tags:    

Similar News