CM Revanth Reddy : కేంద్రానికి అన్ని విధాలా సహకరిస్తాం..సీఎం రేవంత్ రెడ్డి

Byline :  Vinitha
Update: 2024-03-04 06:59 GMT

ప్రధాని మోదీ అంటే మాకు పెద్దన్నలాగా అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి తెలంగాణకు వచ్చిన ప్రధానికి సాదరస్వాగతం పలికారు. రామగుండంలో ఎన్‌టీపీసీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించిన మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ఆదిలాబాద్ కు వచ్చిన ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి ఘనస్వాగతం పలికారు.

Full View

గత ప్రభుత్వ నిర్ణయాలతో విద్యుత్ ఉత్పత్తిలో వెనకబడ్డామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్ఱభుత్వాల ఘర్షణ వల్ల నష్టపోయేది ప్రజలేనని గుర్తు చేశారు. 80 శాతం విద్యుత్ ఉత్పత్తి తెలంగాణకు ఇవ్వాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. విభజన చట్టం ప్రకారం 4వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వ నిర్ణయం వల్ల 1600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. కేంద్రంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అన్నారు. తెలంగాణ సమస్యలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. పదేపదే ఘర్షణలతో ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందదని అన్నారు. ప్రాజెక్ట్ లో మిగిలిన వాటికి అన్ని విధాలా సహాకరిస్తామని చెప్పారు. ఆదిలాబాద్ పూర్తిగా వెనకబడిన ప్రాంతమనీ..ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తిలో తప్పకుండా సహకరిస్తామని చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని అన్నారు. కంటోన్మెంట్ స్థలాన్ని ప్రభుత్వానికి బదిలీ చేసిన ప్రధానికి ధన్యావాదాలు తెలియజేశారు. గుజరాత్ లా తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధానిని కోరారు. రాష్ట్రాభివద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 




Tags:    

Similar News