Bhatti Vikramarka : ప్రతి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్.. కీలక ప్రకటన

Byline :  Krishna
Update: 2024-02-10 08:27 GMT

తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయడమే తమ ప్రభుత్వ సంకల్పమని భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీలో ఆయన మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్లో విద్యారంగానికి రూ. 21,389 కోట్లు కేటాయించారు.

ప్రతి మండలానికి అధునాతనమైన సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను భట్టి విక్రమార్క చెప్పారు. కళాశాల స్థాయిలో ఉద్యోగానికి అవసరమైన కోర్సులను ప్రవేశపెడతామన్నారు. పైలెట్ ప్రాతిపదికన తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు ఈ బడ్జెట్లో రూ. 500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించారు

ఉన్నత విద్యామండలిని పూర్తిగా ప్రక్షాళన చేసి ఉన్నత విద్యలో ప్రమాణాలను మెరుగుపరుస్తామని తెలిపారు. గతంలో విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులను సరైన సమయంలో విడుదల చేయకపోవడంతో ఎంతోమంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెపన్పారు. ఫీజు రీఎంబర్స్మెంట్తో బాటుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బాలబాలికలకు ప్రస్తుత స్కాలర్షిప్లను సకాలంలో అందిస్తామన్నారు.

సాంకేతిక విద్యను పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సమాయత్తం చేయడానికి రాష్ట్రంలోని 65 ఐ.టి.ఐ కాలేజీలను ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఒక బృహత్తర ప్రణాళిక అమలుపరుస్తున్నట్లు భట్టి తెలిపారు. ఈ రంగంలో అనుభవం ఉన్న జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు చెప్పారు. దీంట్లో భాగంగా ఐ.టి.ఐ లకు కొత్త పరికరాలు అందిస్తామన్నారు. అంతేకాకుండా ఈ ఐ.టి.ఐ లలో అదనంగా సీట్లు పెంచి ఎక్కువ మంది విద్యార్థులకు శిక్షణను అందిస్తామని.. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులకు వంద శాతం ఉద్యోగాలు పొందేలా ప్రణాళిక ఉంటుందని తెలిపారు


Tags:    

Similar News