మళ్లీ మాదే అధికారం.. 400 సీట్లు రావడం పక్కా : ఈటల

Byline :  Krishna
Update: 2023-12-09 11:53 GMT

తెలంగాణలో బీజేపీ గతం కంటే ఎంతో మెరుగుపడిందని మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. 2018లో బీజేపీ ఒక సీటు గెలిచి 6 శాతం ఓట్లను సాధిస్తే.. ఈ సారి 8 స్థానాలు గెలిచి15శాతం ఓట్ల షేర్‌‌తో 36 లక్షల ఓట్లు సాధించిందని తెలిపారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో 19 స్థానాల్లో రెండో స్థానం.. 46 స్థానాల్లో డిపాజిట్‌ సాధించామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమన్నారు.

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఈటల అన్నారు. ఈ సారి 17పార్లమెంట్ స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తామన్నారు. గత ఎన్నికల్లో 4ఎంపీ స్థానాల్లో గెలిపొందామన్న ఆయన ఈ సారి క్వీన్ స్వీప్ చేశామన్నారు. మోదీ భారత ప్రజానీకానికి భరోసా ఇవ్వడమే కాకుండా భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. 2014 నుండి 2023 వరకు దేశంలో ఎంతో అభివృద్ధి జరిగిందని చెప్పారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రెండు చోట్లా ఓడిపోయారు. హుజూరాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేసిన ఆయన కేసీఆర్, కౌశిక్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.

Tags:    

Similar News