తెలంగాణకు వర్షసూచన.. 3 రోజుల పాటు భారీ వానలు

Byline :  Kiran
Update: 2023-08-31 16:42 GMT

తెలంగాణ, ఏపీలకు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. మూడు రోజుల్లో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. సెప్టెంబర్ 2,3,4 తేదీల్లో రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సెప్టెంబర్‌ 4వ తేదీ కల్లా వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం వైపు గాలులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ అవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, కొమరం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. ఆయా జిల్లాలకు మూడు రోజులు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.

weather department issued yellow alert to several districts of telangana from september 2

telangana,weather,rain,yellow alert,heavy rains,bay of bengal,spetember,winds,adilabad,asifabad,nirmal,nizamabad,warangal,jangoan,siddipet,yadadri bhuvanagiri,weather department

Tags:    

Similar News