సీఎం రేవంత్‌తో వెల్‌స్పన్‌ గ్రూప్‌ చైర్మన్‌ భేటీ..

Byline :  Krishna
Update: 2024-01-06 15:48 GMT

తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్‌స్పన్ గ్రూప్ ముందుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డితో వెల్‌స్పన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయెంకా భేటీ అయ్యారు. చందన్ వెల్లిలో ప్రారంభించిన ఐటీ సేవల్లో మరో రూ. 250 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్‌స్పన్ గ్రూప్ ప్రకటించింది. టైర్-2, టైర్-3 సెక్టార్లలో ఐటీ అభివృద్ధికి కృషి చేస్తామని గోయెంకా తెలిపారు. వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు తమ కంపెనీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

వెల్‌స్పన్ పెట్టుబడులపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడులను ఆహ్వానించేందుకు తమ ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తుందన్నారు. వెల్‌స్పన్ గ్రూప్కు తమ ప్రభుత్వ సాయం ఎప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు. కాగా వచ్చే ఐదేళ్లలో వెల్‌స్పన్ గ్రూప్ చందన్ వెల్లిలో 3000 నుంచి 5000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వెల్‌స్పన్‌ గ్రూపు కంపెనీల్లో భాగస్వామిగా ఉన్న ‘సింటెక్స్‌’ చందన్ వెల్లిలో తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులతో చందన్ వెల్లిని వెల్స్పన్ వ్యాలీగా మారుస్తామని అప్పట్లో బీకే గోయెంకా ప్రకటించారు.

Tags:    

Similar News