10వ తరగతి బాలిక ధైర్యానికి కేటీఆర్ ఫిదా

Byline :  Aruna
Update: 2023-09-09 09:44 GMT

సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన ట్విటర్‎లో షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఓ పదవ తరగతి విద్యార్థిని ప్రతిభను పొగడ్తలతో ముంచేశారు కేటీఆర్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ఎక్కడా తడబడకుండా చాలా వివరంగా బాలిక ఎంతో ధైర్యంగా మాట్లాడిన తీరుకు మినిస్టర్‎ ఫిదా అయ్యారు. దీంతో ఆ విడియోను కేటీఆర్ ట్విటర్‏లో షేర్ చేశారు. వాట్ ఏ కాన్ఫిడెంట్ అంటూ ఆ బాలికకు కితాబిచ్చారు కేటీఆర్. ప్రాజెక్టు గురించి బాలికకు ఉన్న అవగాహనకు ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

వనపర్తికి చెందిన ప్రణవ శ్లోక 10వ తరగతి చదువుతోంది. వీకెండ్ కావడంతో తన పేరెంట్స్‎తో కలిసి స్థానికంగా ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చింది. ప్రాజెక్టును చూసిన బాలిక ఆ తర్వాత బాలిక మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బాలిక ఎంతో ధైర్యంగా ప్రాజెక్టు గురించి వివరించిన తీరు మినిస్టర్ కేటీఆర్‎ను ఆకర్షించింది. ఆమె మాట్లాడిన తీరుకు ఫిదా అయిన కేటీఆర్ ఆ వీడియోను తన ట్విటర్‎లో షేర్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కేసీఆర్ ప్రభుత్వం రాక ముందు ఆ తర్వాత జిల్లాలో కరువు పరిస్థితుల గురించి ఈ వీడియోలో బాలిక ఎంతో వివరంగా వివరించింది. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులపై ఆమెకు ఉన్న విషయ పరిజ్ఞానానికి వాట్ ఏ కాన్ఫిడెన్స్ అంటూ మంత్రి కితాబిచ్చారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ అమ్మాయికి ఉన్న అవగాహాన ప్రతిపక్షాలకు లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News