Call Forwarding Fraud : ఎట్టి పరిస్థితుల్లో *401# నెంబర్‌కు కాల్ చేయొద్దు. ఎందుకంటే?

Byline :  Bharath
Update: 2024-01-16 02:40 GMT

సైబర్ నేరగాళ్లు కొత్తరకం ఫ్రాడ్ కు తెరలేపారు. టెలికామ్ కంపెనీ నుంచి కాల్ చేసి.. *401# నొక్కమని చెప్తున్నారు. అలా చెప్తే ఎట్టిపరిస్థితుల్లో చేయొద్దని, అలాంటి కాల్స్ కు స్పందించొద్దని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) తెలిపింది. ప్రజలను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు పన్నుతున్న కొత్త ఎత్తుగడ ఇదని డాట్ చెప్పింది. డాట్ పేరుతో కాల్స్ చేసి.. సమస్యలను పరిష్కరిస్తామని చెప్తు.. సైబర్ నేరగాళ్లు అమాయకపు ప్రజలను మోసం చేస్తున్నారు. ఆ కాల్స్ కు రెస్పాండ్ కావొద్దని, వారుచెప్పినవి ఎంటర్ చేయొద్దని డాట్ సూచించింది.

*401# ఎంటర్ చేయగానే కాల్ ఫార్వడింగ్ యాక్టివేట్ అవుతుంది. మీకు రావాల్సిన కాల్స్ వేరే వ్యక్తులను వెళ్లిపోతాయి. దాంతో ఇపార్టెంట్ కాల్స్, మెసేజెస్ సైబర్ నేరగాళ్లు రిసీవ్ చేసుకుని ఫ్రాడ్ చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు, మీ బంధువులు మోస పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని ఎంటర్ చేయొద్దని డాట్ సూచించింది. ఒకవేళ మీ ఫోన్ లో కాల్ ఫార్వడింగ్ యాక్టివేట్ అయి ఉందని మీకు తెలిసినా, అనిపించినా.. వెంటనే ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి డీయాక్లివేట్ చేసుకోండి. లేదా *73 ఎంటర్ చేసైనా డీయాక్టివేట్ చేయొచ్చు.




Tags:    

Similar News