కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ పేరు మారుస్తాం : రాహుల్
ప్రగతి భవన్పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతిభవన్ పేరును ప్రజా పాలన భవన్‌గా మారుస్తామన్నారు. ఆ భవన్ తలుపులు ప్రజల కోసం 24 గంటలు తెరిచే ఉంటాయని చెప్పారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను 72గంటల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీఎంతో పాటు ప్రజలందరూ క్రమం తప్పకుండా ప్రజా దర్బార్ లు నిర్వహిస్తారని తెలిపారు. ప్రజా తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలంతా తమకు అండగా నిలవాలని కోరారు.
తెలంగాణలో మూడు నియోజకవర్గాల్లో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పినపాక, నర్సంపేట, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టారు. సాయంత్రం ఢిల్లీకి తిరిగి వెళ్లారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కులగణన చేపడతామని రాహుల్ గాంధీ అన్నారు. ఏయే కులాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. కులగణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. వరంగల్లో కొండా సురేఖకు మద్ధతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో కేసీఆర్, కేంద్రంలో బీజేపీని సాగనంపడమే తమ లక్ష్యమన్నారు.