Ayodhya Ram Mandir : ఇవాళే అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట ఎందుకంటే..?

Byline :  Krishna
Update: 2024-01-22 02:01 GMT

ఇవాళ అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఇవాళ మధ్యాహ్నం అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. మధ్యాహ్నం 12.20 నుంచి 1వరకు ఈ క్రతువు నిర్వహిస్తోన్నారు. దీంతో దేశం మొత్తం రామనామ స్మరణతో మార్మోగుతోంది. ఈ రోజు కోసం హిందువులు వందల ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే రామ మందిర ప్రారంభం, ప్రాణ ప్రతిష్ఠ కోసం జనవరి 22ను ఎంచుకోవడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం జనవరి 22 పౌష్య మాసంలోని శుక్లపక్ష ద్వాదశి. ఈ రోజు ఉదయం 8.47 గంటల నుంచి మృగశిర నక్షత్రం, ఇంద్రయోగం ప్రారంభమవుతుంది. ఇవాళ కర్మ ద్వాదశి కూడా జరుపుకుంటారు.

పురాణాల ప్రకారం కర్మ ద్వాదశి రోజున సాగర మథనం కోసం విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తాడు. అందుకే విష్ణు మూర్తి ఏడో రూపమైన శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ అదే రోజున జరపాలని నిర్ణయించారు. జనవరి 22 మధ్యాహ్నం 12.29గంటల నుంచి 12.30 గంటల మధ్య 84 సెకండ్ల వ్యవధిలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఆ తర్వాత మహాపూజ, మహాహారతి నిర్వహిస్తారు. జోతిష్య శాస్త్ర ప్రకారం జనవరి 22నే సర్వత సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, రవి యోగం సైతం ఏర్పడనున్నాయి. అందుకే శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ఠకు ఈ రోజును ఎంచుకున్నారని వేద పండితులు చెబుతున్నారు.

Tags:    

Similar News