పెద్దలను ఎదురించి ప్రేమపెళ్లి.. పట్టపగలే భార్య కిడ్నాప్..
వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఇంట్లో ఒప్పుకోకపోవడంతో పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. కుటుంబాలకు దూరంగా జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో దంపతులు పరీక్ష రాసేందుకు వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు భర్తను చితక్కొట్టి భార్యను కిడ్నాప్ చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.
ఖమ్మం నగరానికి చెందిన సన్నీ.. కొత్తగూడెంకి చెందిన మాధవి ప్రేమించుకున్నారు. కుటుంబస్యభులు ఒప్పుకోకపోవడంతో పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. దీంతో తమ కూతురు కులాంతరం వివాహం చేసుకోవడంపై మాధవి కుటంబసభ్యులు ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఇవాళ భార్యభర్తలు ఎగ్జామ్ రాసేందుకు ఆటోలో వెళ్తుండగా కారులో వెంబడించి.. మార్గమధ్యలో భర్తపై దాడి చేస మాధవిని దుండగులు ఎత్తుకెళ్లారు.
మాధవి కుటుంబసభ్యులే ఈ కిడ్నాప్ కు పాల్పడినట్లు సన్నీ ఆరోపిస్తున్నాడు. తాము పెళ్లి చేసుకోవడం వారి నచ్చకపోవడంతోనే మాధవిని ఎత్తుకెళ్లారని అన్నారు. ఇక ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్యను తన దరికి చేర్చాలని విజ్ఞప్తి చేశాడు.