హైదరాబాద్కు WWE సూపర్ స్టార్స్.. ఆ రోజే స్పెషల్ ఈవెంట్...

Update: 2023-08-14 08:55 GMT

హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక ఈవెంట్కు వేదిక కానుంది. నగరంలో ఇటీవల ఫార్మూల వన్ రేస్ ఈవెంట్ నిర్వహించారు. ఇది సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు మరో స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈవెంట్ను తొలిసారి హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో WWE సూపర్‌స్టార్ స్పెక్టాకిల్ ఈవెంట్ను నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దీనికి సంబంధించిన వాల్ పోసర్ట్ను ఆయన రిలీజ్ చేశారు.

ఈ ఈవెంట్లో 28మంది WWE ఆటగాల్లు పాల్గొంటారని మంత్రి చెప్పారు. ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ సాధించిన ఫ్రీకిన్ రోలిన్స్, మహిళల ప్రపంచ ఛాంపియన్ రియా రిప్లే, సమీ జైన్, కెవిన్ ఓవెన్స్‌లతో సహా కీలక సూపర్‌స్టార్స్ పాల్గొంటారు. ఈ ఈవెంట్ టికెట్స్ www.bookmyshow.com లో అందుబాటులో ఉంటాయి.

సెప్టెంబర్ 8న ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇక ఈవెంట్ కోసం wwe ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ దేశంలోనే రెండోది. మొదటి ఈవెంట్ 2017లో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగింది.



Tags:    

Similar News