తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇటీవల తన భర్త ఈటలకు ప్రాణహాని ఉందంటూ ఈటల జమున ఆరోపించారు. ఈటల హత్యకు BRS ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి రూ.20 కోట్లు సుపారీ ఇచ్చారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్ సైతం తనకు ప్రాణహాని ఉందని చెప్పంతో ఈ అంశం హాట్ టాపిక్ మారింది.
డీజీపీ ఆదేశాల మేరకు రెండు రోజుల క్రితం మేడ్చల్ డీసీపీ సందీప్ రావు ఈటలను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం డీజీపీకి నివేదిక సమర్పించారు. నివేదిక ఆధారంగా ఈటలకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ఈటలకు వై ప్లస్ సెక్యూరిటీ కల్పించనున్నారు. వై ప్లస్ సెక్యూరిటీ లో బుల్లెట్ ఫ్రూఫ్ వెహికల్తో పాటు 16 మంది సెక్యూరిటీ ఉండనున్నారు.