లంచం తీసుకుంటూ ఓప్రభుత్వ అధికారి ఏసీబీకి చిక్కారు. యాదాద్రి భువనగిరి జిల్లా ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి లంచం తీసుకోనిదే ఏ పని చేయడు అని అక్కడ అంతా టాక్. ఈ నేపథ్యంలోనే పని కోసం వచ్చిన ఓ వ్యక్తి నుంచి ఆయన లంచం డిమాండ్ చేశాడు. రూ.5,000 ఇస్తే తప్ప పని చేయనని తేల్చిచెప్పాడు. దీంతో చేసేదేమిలేక ఆ వ్యక్తి ఏసీసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో శుక్రవారం తమ పథకం ప్రకారం లంచం తీసుకుంటుండగా ట్రాన్స్ పోర్టు అధికారి సురేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన్ని అదుపులోకి తీసుకుని 29,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులు లంచం తీసుకున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.