Yadadri Temple Closed: భక్తులకు అలర్ట్... ఈ వారంలో యాదాద్రి ఆలయం మూసివేత

Update: 2023-10-22 02:20 GMT

ఈ ఏడాదిలో రెండవ చంద్రగ్రహణం ఈ నెల(అక్టోబర్) 28వ తేదీన అర్ధరాత్రి ప్రారంభమై అక్టోబర్ 29 తెల్లవారుజామున 2:22 గంటలకు ముగుస్తుందని పండితులు తెలుపుతున్నారు. ఇది పాక్షిక చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కూడా కనిపిస్తుంది. దీని కారణంగా దేశంలో సూతక కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. గ్రహణం సమయంలో ఆలయ ద్వారాలు మూసివేస్తారు. శుభాకార్యాలను నిషేధిస్తారు.

ఈ క్రమంలో చంద్ర గ్రహణం సందర్భంగా ఈ నెల 28న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు. గ్రహణం కారణంగా ఒక్క రోజు ముందు అంటే 27వ తేదీన రాత్రి 7 గంటలకు శరత్‌ పౌర్ణమి వేడుకలను బ్రహ్మోత్సవ కల్యాణ మండపంలో నిర్వహించనున్నారు. 28వ తేదీన సాయంత్రం 4 గంటలకే ఆలయాన్ని మూసివేస్తారు. ప్రధానాలయంతో పాటు అనుబంధ ఆలయాలైన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం, పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను మూసివేయనున్నారు. గ్రహణం పూర్తయిన తరువాత 29వ రోజున ఆలయాన్ని వేకువజామునే తెరిచి సంప్రోక్షణ నిర్వహిస్తారని సమాచారం. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మే 5న సంభవించిన తెలిసిందే.

Tags:    

Similar News