యాదగిరిగుట్ట ఆలయ ఈవో ఇన్‌ఛార్జి రామకృష్ణరావుపై వేటు పడింది. ఇటీవల సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రుల ఆలయానికి వెళ్లినప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కింద కుర్చోవడం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన వివరణ ఇచ్చిన ప్రోటోకాల్ విషయంలో ఈవో నిర్లక్ష్యం వహించారని దేవాదాయ ధర్మాదాయ శాఖ బదిలీ చేసింది.వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చే సమయంలో మిగతా మంత్రుల కంటే కాస్త తక్కువ ఎత్తున్న స్టూల్‌పై డిప్యూటీ సీఎంను కూర్చోబెట్టారు.
దీంతో ఉపముఖ్యమంత్రికి అవమానం అంటూ పెద్ద ఎత్తున దుమారం రేపింది. ఇదే అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం స్పందించారు. అవమానం లాంటిది ఏమీ లేదని… తానే కింద కూర్చున్నానని చెప్పుకొచ్చారు. అయినా నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆలయ ఈవోపై చర్యలు తీసుకున్నారు. కాగా, మరోవైపు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాదగిరిగుట్ట దేవస్థాన అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే పది సమాంతర పీఠలను ఆలయ సిబ్బంది కొనుగోలు చేసింది. పాతవి 4, కొత్తవి 10 పీటలతో సహా ఒకేసారి 14 మంది వీవీఐపీలకు వేద ఆశీర్వచనం చేసేలా దేవస్థాన అధికారులు చర్యలు చేపట్టింది.