బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్న నర్సాపూర్ ఎన్నికల సభలో కలకలం రేగింది. ఓ యువకుడి దగ్గర రెండు బుల్లెట్లు బయటపడ్డాయి. మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో గురువారం నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద సభ’కు వస్తున్న ప్రజలను తనిఖీ చేస్తుండగా అతని దగ్గర తూటాలు దొరికాయి. అతణ్ని సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌కి చెందిన అస్లాంగా గుర్తించారు. అస్లాంను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. సీఎం సభలో తూటాలు బయటపడ్డంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనపడుతున్నాయి. దీనికి వెనక ఎవరి హస్తమైనా ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.