కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనం ఖరార్! అక్క ఏం చెప్పారంటే..
కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనం ఖరార్! అక్క ఏం చెప్పారంటే..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేని ఏమిటో ఈ రోజు స్పష్టంగా తెలుస్తోందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల అన్నారు. కేసీఆర్ అవినీతి, అక్రమాల ప్రభుత్వాన్ని గద్దె దింపడానికే కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌లో తమ పార్టీ విలీనంపై చర్చలు కొలిక్కి వచ్చాయని వెల్లడించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ప్రశంసల వర్షం కురిపించారు. తన పార్టీ శ్రేణులతో మాట్లాడాక విలీనంపై ప్రకటన చేస్తానన్నారు. శనివారం వైఎస్ 14వ వర్ధంతి సందర్భంగా ఆమె పంజగుట్టలోని తన తండ్రి విగ్రహాన్ని పూమాల వేసి నివాళి అర్పించారు.
అందుకే చర్చలు..
వైఎస్‌పై కాంగ్రెస్‌కు గౌరవం ఉంది కాబట్టే చర్చల కోసం ఢిల్లీ వెళ్లానని ఆమె చెప్పారు. రాజీవ్ గాంధీ చనిపోయాక నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో తన తండ్రి పేరును పొరపాటుగా చేర్చారని, సోనియాకు ఈ విషయంతో ఏమాత్రం సంబంధం లేదని షర్మిల చెప్పారు. తెలంగాణ బాగుపడాలంటే కేసీఆర్ పాలనను అంతమొందించాల్సిందేనని అన్నారు. ‘‘నేను 3,800 కి.మీ. పాదయాత్ర చేశాను. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు కలసి రావాలి’’ అని ఆమె అన్నారు. రాజకీయాల్లో రాత్రికి రాత్రి అద్భుతాలు సాధ్యం కావని, ఏంతో నిబ్బంరతో వేచి చూడాల్సి ఉంటుందని చెప్పారు.