తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలవడనున్నాయి. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకే పట్టంగట్టినా.. బిఆర్ఎస్, బీజేపీ నేతలు తమ పార్టీలే గెలుస్తాయని ధీమా వ్యక్తి చేస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై వైఎస్సీర్టీపీ అధినేత్రి షర్మిల బైబై కేసీఆర్ అంటూ వెరైటీ గిఫ్ట్ పంపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ పై షర్మిల తనదైన శైలిలో స్పందించారు. కాంగ్రెస్ పార్టీని ఓడించడం అతి సులువైన పనే. కానీ కేసీఆర్ ను ఓడించాలనేది తమ ఉద్దేశమని చెప్పుకొచ్చారు. అందుకే కాంగ్రెస్ కు మద్దతిచ్చినట్లు చెప్పారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు బై బై చెప్పరని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ సూట్ కేసు సర్దుకునే టైమొచ్చిందని అన్నారు. కర్నాటకలో 71 మంది పదివేల మేజార్టీతో గెలిచారని, వైఎస్సార్టీపీ పోటీ చేస్తే మరో 5వేల ఓట్లు చీలేవని చెప్పారు. అందుకు ఎన్నికల్లో పోటీ చేయలేదని స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసే ఉన్నాయని తెలంగాణ ప్రజలకు అర్థం అయిందని చెప్పారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ యాక్షన్ తీసుకోకపోవడంతోనే ఈ ఇద్దరి మధ్యున్న స్నేహం బయటపడిందని ఆరోపించాడు. కేసీఆర్ ను మించిన అవినీతి పరుడు దేశంలో లేడని అమిత్ షా చెప్పారు, కేసీఆర్ అవినీతి అంతా బయటపెడతామని మోదీ అన్నారు. ఇంత తెలిసినా కేసీఆర్ పై ఎందుకు యాక్షన్ తీసుకోలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయకుండా, బ్యాక్ డోర్ పాలిటిక్స్ కు పాల్పడకుండా ఎన్నికల్లో నిజాయితీగా గెలవాలని కేసీఆర్ కు షర్మిల సవాల్ విసిరారు.