Paleru: ఎన్నికల బరిలో షర్మిల.. పొంగులేటిపై పోటీ

By :  Bharath
Update: 2023-10-29 15:33 GMT

తెలంగాణ ఎన్నికల బరిలోకి వైఎస్సాటీపీ అధ్యక్షురాలు షర్మిల దిగబోతున్నారు. ఎట్టకేలకు ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేయబోతున్నారనేదానిపై క్లారిటీ ఇచ్చారు. ఆమె గతంలో చెప్పినట్లు గానే పాలేరు నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. నవంబర్ 1 నుంచి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ప్రచారం చేయాలని షర్మిల నిర్ణయించుకున్నారు. నవంబర్ 4న నామినేషన్ దాఖలు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా వైఎస్ కుటుంబాని అత్యంత సన్నిహితుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరుపున పాలేరులో పోటీ చేస్తున్నారు.

దీంతో పాలేరులో షర్మిల వర్సెస్ పొంగులేటి పోరు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. పొంగులేటి పాలేరు నుంచి పోటీ చేస్తుండటంతో షర్మిల వేరే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం జరిగింది. కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డిపై షర్మిల పోటీ చేస్తారనే వార్తలు కూడా బలంగా వినిపించాయి. అంతేకాకుండా వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని ప్రయత్నాలు జరిగాయి. అయితే అవేవీ కుదరకపోవడంతో షర్మిల పార్టీ విలీనం ఆగిపోయి.. తన పార్టీ నుంచే పోటీకి సిద్ధం అయింది.

Tags:    

Similar News