తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన అన్ని చర్యలను బీఆర్ఎస్ తీసుకుంటోంది. ఇప్పటికే ఎమ్మెల్యేల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సర్వేలు ఆదారంగా సీట్లను కేటాయించినట్లు సమాచారం. పనితీరు బాగాలేని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు దక్కడం అనుమానమేనని వార్తలు వస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శల పర్వం కొనసాగుతోంది. తాజాగా కేసీఆర్‌కు షర్మిల్ సవాల్ విసిరారు. కేసీఆర్‌కు దమ్ముంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చి ఎన్నికల బరిలో నిలవాలని ట్వీట్ చేశారు.
" ఉద్యమ సెంటిమెంట్‌తో మొదటిసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన దొర గారు.. రెండోసారి తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో కుర్చీని కాపాడుకున్నారు. తొమ్మిదేండ్ల నుంచి అవినీతి ఏరులై పారించి, ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టాడు. కుటుంబానికి పదవులు కట్టబెట్టి, ఉద్యమ ద్రోహులను నెత్తిన పెట్టుకున్నాడు. ఇన్నాళ్లు దొర గారు దర్జాగా గడీల్లో ఉంటే.. ఎమ్మెల్యేలు బందిపోట్ల లెక్క ప్రజల మీద పడి దోచుకున్నారు. కబ్జాలకు, అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ప్రశ్నించిన వాళ్లను చితకబాదారు. ఎన్నికలొచ్చే సరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలపై జనం గుర్రుగా ఉన్నారని తెలుసుకున్న దొర గారు ఉలిక్కిపడుతున్నారు. సిట్టింగులకు సీట్లు అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే... సర్వేల పేరుతో హడావిడి చేస్తున్నాడు. ఎమ్మెల్యేలను మారిస్తే తప్ప తాను గట్టెక్కలేనని తెలుసుకున్నాడు. దొర కేసీఆర్ కి YSR తెలంగాణ పార్టీ సవాల్ విసురుతోంది. మీది అవినీతిరహిత పాలనే అయితే, హామీలు నెరవేర్చి ఎన్నికల మ్యానిఫెస్టోకి న్యాయం చేసిన వారే అయితే, మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చి ఎన్నికల బరిలో నిలవండి. మీరు, మీ ఎమ్మెల్యేలు సుద్ధపూసలు అయితే గెలిచి మీ పాలనకు ఇది రెఫరెండం అని ప్రూవ్ చేయండి. కేసీఆర్ గారు దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించండి." అంటూ ట్విట్టర్ వేదికగా షర్మిల సవాల్ విసిరారు.
ఉద్యమ సెంటిమెంట్ తో మొదటిసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన దొర గారు.. రెండోసారి తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో కుర్చీని కాపాడుకున్నారు. తొమ్మిదేండ్ల నుంచి అవినీతి ఏరులై పారించి, ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టాడు. కుటుంబానికి పదవులు కట్టబెట్టి, ఉద్యమ ద్రోహులను నెత్తిన పెట్టుకున్నాడు. ఇన్నాళ్లు…
— YS Sharmila (@realyssharmila) July 23, 2023