Gruha Jyothi Scheme : జీరో కరెంట్ బిల్లులకు రంగం సిద్ధం

Byline :  Vinitha
Update: 2024-03-01 05:26 GMT

నగరంలో జీరో కరెంట్ బిల్లులకు రంగం సిద్ధమైంది. కరెంట్ బిల్లులతో రేషన్ కార్డు జత చేసిన వినియోగదారులకు గృహజ్యోతి లభించనుంది. కాంగ్రెస్ 6 గ్యారెంటీల్లో భాగంగా రూపొందించిన గృహజ్యోతి పథకం అమలుకానుంది. 200 యూనిట్లలోపు కరెంట్ వాడిన వారందరికీ ఈ నెల జీరో బిల్లు రానుంది.

ఈ మేరకు అధికారులు బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేర్పులు చేశారు. జీరో బిల్లులను ఇచ్చేందుకు ప్రత్యేకంగా కొత్త బిల్లింగ్ మిషన్లను తీసుకున్నారు. వీటి పనితీరును ఇప్పటికే పరిశీలించి..టెస్టింగ్ కోసం జీరో బిల్లుల జారీ చేసి చూసినట్లు అధికారులు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేటి నుంచి ఈ ప్రక్రియ అన్ని సెక్షన్లలో ప్రారంభించాలని సీఎండీ ఆదేశించారు. మార్చి బిల్లింగ్ వివరాలను బిల్లింగ్‌ యంత్రాల్లో లోడ్‌ చేయాలని సీఎండీ సూచించారు. కాగా నగరంలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 48.06 లక్షల గృహజ్యోతి విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయన్నారు. జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కలిపి గృహజ్యోతికి 19.85 లక్షల మంది దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవారికే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అని ప్రకటించడంతో..ఇప్పటివరకు 11 లక్షల మందే ఈ పథకానికి అర్హులయ్యారు. 

Tags:    

Similar News