Election Schedule : 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. కౌంటింగ్ ఎప్పుడంటే..?

Byline :  Krishna
Update: 2023-10-09 07:39 GMT

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. తెలంగాణతో పాటు మిజోరాం, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుంది. మిజోరాంలో నవంబర్ 7న పోలింగ్ జరగనుంది. నంబర్ 17న మధ్యప్రదేశ్, నవంబర్ 23 రాజస్థాన్ రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. ఇక ఛత్తీస్ గఢ్లో రెండు విడుతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ నవంబర్ 7, 17న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న అన్ని రాష్ట్రాల కౌంటింగ్ ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది.

ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వడంతో 5 రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. 5 రాష్ట్రాల్లో 679 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో 119, రాజస్థాన్ - 200, మధ్యప్రదేశ్ - 230, ఛత్తీస్‌గఢ్‌ - 90, మిజోరాం - 40 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 5 రాష్ట్రాల్లో 16.14 కోట్ల ఓటర్లు తమ ఓటు హాక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో కొత్తగా 60లక్షల మంది ఓటు వేయనున్నారు. మొత్తం 1.77 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు.


Tags:    

Similar News