Mallikarjun Kharge : సీఎం అభ్యర్థి ఎంపికపై ఖర్గే క్లారిటీ.. సాయంత్రంలోపు..

Byline :  Krishna
Update: 2023-12-05 04:47 GMT

కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ సీఎల్పీ తీర్మానించడంతో బంతి అధిష్టానం కోర్టులో ఉంది. ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నా కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏఐసీసీ ఇంచార్జ్ మాణికరావ్ థాక్రే సోమవారం రాత్రే ఢిల్లీ వెళ్లారు. ఇవాళ ఖర్గేతో వారిద్దరూ సమావేశమై.. సీఎం అభ్యర్థిపై చర్చిస్తారు. ఈ క్రమంలో సీఎం ఎంపికపై ఖర్గే క్లారిటీ ఇచ్చారు. ఇవాళ సాయంత్రంలోపు సీఎం అభ్యర్థిని ఫైనల్ చేస్తామని స్పష్టం చేశారు. దీంతో సీఎం ఎవరనేదానికి మరికొన్నిగంటల్లో చెక్ పడనుంది.

కాగా సీఎం రేసులో ఉన్న సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ మధ్యాహ్నం మల్లిఖార్జున ఖర్గేతో వారు భేటీ కానున్నారు. తమ సీఎం, మంత్రిమండలి ఎంపిక గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నెక్ట్స్ సీఎంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. సీఎల్పీ భేటీలోనూ రేవంత్ రెడ్డి వైపే మెజార్టీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపినట్లు టాక్. ఈ క్రమంలో సీఎం రేసులో ఉన్న ఉన్న భట్టి, ఉత్తమ్ ఢిల్లీకి వెళ్లి ఖర్గేతో భేటీ కానుండటం హాట్ టాపిక్‌గా మారింది.


Tags:    

Similar News