BJP అభ్యర్థి తుల ఉమకు షాక్.. వికాస్ రావుకే బీఫామ్

Byline :  Veerendra Prasad
Update: 2023-11-10 08:13 GMT

అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ అధిష్టానం ఇంకా అయోమయంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు విడుదల చేసిన తుది జాబితాలో ఇద్దరు బెల్లంపల్లి, అలంపూర్ అభ్యర్థులను మార్చిన అధిష్టానం.. తాజాగా నామినేషన్ వేసిన అభ్యర్థికి కాకుండా మరో వ్యక్తికి బీ ఫామ్ ఇచ్చి అందరికీ షాకిచ్చింది. మరో వైపు నామినేషన్ స్వీకరణకు మరికొన్ని గంటల మాత్రమే సమయం ఉండడంతో అధిష్టానం తీసుకున్న నిర్ణయాలకు అభ్యర్థులంతా తలలు పట్టుకుంటున్నారు.

వేములవాడలో ఒకే అసెంబ్లీ స్థానానికి ఇద్దరు బీజేపీ నేతలు కాసేపటి క్రితం పోటాపోటీ నామినేషన్లు వేశారు. వేములవాడ అసెంబ్లీకి బీజేపీ పార్టీ తరుపున తుల ఉమ శుక్రవారం నామినేషన్‌ వేశారు. బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టే నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. అయితే ఇదే సమయంలో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ రావు తరపున ఆయన వర్గీయులు నామినేషన్‌ వేశారు. అయితే తుల ఉమకే బీజేపీ బీఫామ్ ఇస్తుందని.. వికాస రావు టికెట్ ఆశించి భంగపడడమే తప్ప మరోటి జరగదని అంతా అనుకున్నారు.

కానీ బీజేపీ లాస్ట్ మినిట్ లో తుల ఉమకు కాకుండా.. వికాసరావుకు బీఫామ్ ఇచ్చింది. దీంతో మహిళలను రాజకీయాల్లో ఎదగనివ్వరా? బీసీలు ఎమ్మెల్యేలుగా పోటి చేయకూడదా అంటూ మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన తుల ఉమకు వేములవాడ టికెట్ వచ్చేలా చూసుకున్నారు బీజేపీ నాయకుడు ఈటల. ఈ టికెట్ ను తుల ఉమకు ఇప్పించడం కోసం పట్టుబట్టి మరీ ఈటల అధిష్ఠానాన్ని ఒప్పించారు. కానీ చివరి నిమిషంలో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ రావును అభ్యర్థిగా కన్ఫామ్ చేసింది బీజేపీ అధిష్టానం.




Tags:    

Similar News