Revanth Reddy : ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకండి : బాలకృష్ణ

Byline :  Krishna
Update: 2023-12-06 01:45 GMT

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నందమూరి బాలకృష్ణ రేవంత్ రెడ్డికి స్పెషల్ విషెస్ చెప్పారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు. ప్రజా సేవ పరమావధిగా రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి ఆకాంక్షను నేరవేర్చడంతో పాటు అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పథంగా ముందుకు పోవాలని ఆశిస్తున్నాను. సీఎంగా మీ పాలన మార్క్తో తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని బాలకృష్ణ అన్నారు.

కర్నాటక సీఎం సిద్ధిరామయ్య కూడా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన రేవంత్కు శుభాకాంక్షలు. మీ ఆధ్వర్యంలో వచ్చే 5ఏళ్లు రాష్ట్రం అభివృద్ధిలో పయనిస్తుంది. మీ నాయకత్వంలో ప్రజలకు ప్రగతిశీల, పారదర్శక పాలన అందుతుందని ఆశిస్తున్నా’’ అని ట్వీట్ చేశారు.

నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ రేవంత్ రెడ్డికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సీఎంగా ఎంపికైన మా నాయకుడు, నిరంతరం నా శ్రేయస్సును కోరుకునే మా అన్న రేవంత్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నాడు బూర్గుల.. నేడు ఎనుముల.. పాలమూరు నుంచి ముఖ్యమంత్రులు’’ అని బండ్ల ట్వీట్ చేశారు.




Tags:    

Similar News