Bandi Sanjay : కరీంనగర్ ఫలితంపై ఉత్కంఠ.. కౌంటింగ్ సెంటర్ వద్ద హైడ్రామా
Byline : Bharath
Update: 2023-12-03 12:47 GMT
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఊహించని షాకులు తగిలాయి. పార్టీ బడా లీడర్లు కరీంనగర్ లో బండి సంజయ్, హుజురాబాద్ లో ఈటల రాజేందర్, కోరుట్లలో ధర్మపురి అరవింద్, దుబ్బాకలో రఘునందన్ రావు అంతా దారుణంగా ఓడిపోయారు. కీలక నేతలంతా ఓడిపోగా.. ఎవరూ ఊహించని స్థానాల్లో బీజేపీ గెలిచింది. బండి సంజయ్ పై బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ 326 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో కరీంనగర్ అసెంబ్లీ ఫలితాలపై హైడ్రామా మొదలైంది. కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయని బండి సంజయ్ ఆరోపించారు. రీకౌంటింగ్ పెట్టాలని బండి సంజయ్ పట్టుబట్టుకు కూర్చున్నారు. దీంతో ఫలితాన్ని అధికారికంగా ప్రకటించకుండా నిలిపేశారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.