Bandi Sanjay : ఉద్యోగాలు ఇవ్వనోడు సీఎం.. సేవ చేయనోడు మంత్రి: బండి సంజయ్

Byline :  Bharath
Update: 2023-11-25 08:39 GMT

బీజేపీ అధికారంలోకి వస్తే రైతులకు వరి కనీస మద్దతు ధర రూ. 3100 చెల్లిస్తామని హామీ ఇచ్చారు బండి సంజయ్. అధికారం చేపట్టిన వెంటనేన కొత్త రేషన్ కార్డులు, పించన్లు మంజూరు చేస్తామని చెప్పారు. తీగలగుట్టపల్లి, ఇరుకుల్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన బండి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటేస్తే.. ఇండ్లు కూడా కబ్జా చేస్తారని ఆరోపించారు. భూకబ్జా, బ్లాక్ మెయిల్, చీటింగ్ కేసుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులది పెట్టింది పేరని విమర్శించారు. పేద ప్రజలకు రేషన్ కార్డులు, బీసీ బంధు ఇవ్వని నాయకుడు బీసీ శాఖ మంత్రిగా ఉండటం దండగని అన్నారు. ఇంట్లో అందరికీ పదవులు ఇచ్చి.. నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. గంగుల కమలాకర్ కు ధైర్యముంటే అవినీతి, అభివృద్ధి, ఆస్తులపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. జీవితాన్ని పణంగా పెట్టి ప్రజల కోసం, ప్రజల పక్షణ పోరాడుతున్నానని బండి చెప్పుకొచ్చారు. డిసెంబర్ 3 తర్వాత రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.




Tags:    

Similar News