Bandi Sanjay Nomination: బీఆర్ఎస్ పార్టీ పుట్టకముందే ‘స్వరాష్ట్రం’ అన్నది బీజేపీ: బండి సంజయ్

Byline :  Bharath
Update: 2023-11-06 07:48 GMT

బీఆర్ఎస్ పార్టీ పుట్టముందే తెలంగాణ నినాదాన్ని తీసుకొచ్చిన పార్టీ బీజేపీఅని అన్నారు బండి సంజయ్. ఇవాళ (నవంబర్ 6) ఎలక్షన్ నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలుదేరిన బండి.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 317 జీవోకు వ్యతిరేకంగా కొట్లాడిన వ్యక్తి బండి సంజయ్, రైతులు, విద్యార్థులు, ఉద్యోగుల కోసం లాఠీ దెబ్బలు తిని జైలుకు వెళ్లిన వ్యక్తి బండి సంజయ్, ప్రజల కోసం ప్రభుత్వంతో కొట్లాడిన వ్యక్తి బండి సంజయ్.. ఈ అసెంబ్లీ ఎన్నిక కరీంనగర్ నియోజకవర్గం కోసం కాదని, ప్రభుత్వంతో పోరాటం అని చెప్పుకొచ్చారు. ప్రజల తీర్పు.. తెలంగాణలో చారిత్రక మార్పు తీసుకొస్తుందని చెప్పారు.

తెలంగాణ బిల్లుకు సుష్మా స్వరాజ్ మద్దతు పలికారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో స్మార్ట్ సిటీ పేరుతో హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది బీజేపీ. కరీంనగర్- వరంగల్ హైవేకి నిధులిచ్చింది బీజేపీ అని వివరించారు. సీఎం, ఆయన కొడుకు కేటీఆర్ మీటింగ్స్ పెడితే చూడ్డానికి ఎవరు రావట్లేదు. ప్రచారానికి వెళ్లిన ప్రతీచోట ప్రజలు తిరగబడుతున్నారని బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరాన్ని సర్వనాశనం చేసి, ఫేక్ రిపోర్టులిస్తున్నారని ప్రతిపక్షాలను అంటున్నారు. ఫామ్ హౌస్ లో కూర్చొని సొంత ప్లానింగ్ చేసి కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టును నిండా ముంచారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందన్న మాట వాస్తవం. దాన్ని పక్కనబెట్టి ఫెయిల్యూర్ ను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.




Tags:    

Similar News