Bandla Ganesh : బండ్ల గణేష్ 7.ఓ క్లాక్ బ్లేడ్ నుంచి ఎల్బీ స్టేడియం వరకూ

By :  Kalyan
Update: 2023-12-03 10:47 GMT

బండ్ల గణేష్ అంటే కొన్నాళ్లుగా మీమ్ మెటీరియల్ గా చూశారు. చూస్తున్నారు. వేదికలపై ఆయన మాట్లాడితే చాలు.. సోషల్ మీడియాలో అదో సంచలనం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు భక్తుడుగా చెప్పుకుంటాడు. అదే సందర్భంగా తను మాత్రం జనసేనకు సపోర్ట్ చేయడు. ముందు నుంచీ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. గత ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేశాడు. ఆ క్రమంలో చేసిన కొన్ని వ్యాఖ్యలతో మీమ్ మెటీరియల్ గా మారాడు.ట్రోలర్స్ కు మంచి పని ఇచ్చాడు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే 7. ఓ క్లాక్ బ్లేడ్ తో కోసుకుంటా అని చెప్పాడు. కాంగ్రెస్ ఓడిపోయింది. అతను అభాసుపాలయ్యాడు. ఎవరు పడితే వాళ్లు అతన్ని బ్లేడ్ గణేష్ అంటూ ఆడుకున్నారు. దీంతో తను వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అని ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. బట్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచిందో.. మళ్లీ యాక్టివ్ అయ్యాడు. అక్కడి ఉపముఖ్యమంత్రి డికే శివకుమార్ ను కలిసి మళ్లీ పార్టీ కోసం పనిచేస్తా అని చెప్పాడు. రేవంత్ అతనికి టికెట్ ఇస్తా అన్నా కూడా వద్దని పార్టీ గెలుపు కోసం పనిచేస్తా అని ఆ మేరకే కట్టుబడి ఉన్నాడు.

ఈ క్రమంలో తను ఈ నెల 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారసభకు వెళుతున్నా అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు. దీంతో ఇది కూడా 7ఓ క్లాక్ బ్లేడ్ లాగా బూమరాంగ్ అవుతుందనుకున్నారు. కానీ ఈ సారి బండ్ల గణేష్ నమ్మకం వమ్ము కాలేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా విజయభేరి మోగించింది. అన్నట్టుగానే తను ఎల్బీ స్టేడియానికి వెళుతున్నా అని ఎక్స్(ట్విట్టర్)లో ప్రకటించాడు. ఈ సారి బండ్ల మీమర్స్ కు షాక్ ఇచ్చాడనే చెప్పాలి. ఏదేమైనా దేన్నైనా నమ్మితే బండ్ల గణేష్ లా నమ్మాలి. బిఆర్ఎస్ ను ఎప్పుడూ తిట్టలేదు. వ్యతిరేకించలేదు. కానీ కాంగ్రెస్ గెలవాలని మాత్రం బలంగా కోరుకున్నాడు. అతని కోరిక నెరవేరింది. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైనా నామినేటెడ్ పదవి వస్తే అతనికి వాళ్లు సముచిత స్థానం ఇచ్చినట్టుగానే చెప్పాలి.

Bandla Ganesh about Congress victory in 2023,

I will go to oath ceremony in LB Stadium,

Bandla Ganesh 7.O Clock blade,

Bandla Ganesh about Revanth Reddy and CM,

Tags:    

Similar News