Barrelakka Manifesto: ప్రత్యర్థుల దిమ్మతిరిగేలా బర్రెలక్క మేనిఫెస్టో

Byline :  Bharath
Update: 2023-11-23 08:28 GMT

తెలంగాణ ఎన్నికల్లో సెన్సెషన్ సృష్టిస్తుంది బర్రెలక్క అతియాస్ కర్నె శిరీష. చదువుకున్నప్పటికీ ఉద్యోగం రాక, బర్రెలు కాసుకుని తన అనుభవాలను రీల్స్ రూపంలో షేర్ చేస్తూ, ప్రభుత్వ తీరును విమర్శిస్తూ ఫేమస్ అయింది శిరీష. అంతేకాదు ఇప్పుడున్న నాయకులకు సవాల్ విసురుతూ కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగింది. ప్రచారంలో దూసుకుపోతున్న శిరీష్.. సోషల్ మీడియా, యూట్యూబ్ చానల్స్ ఇంటర్వ్యూల ద్వారా స్వచ్ఛందంగా ప్రచారం చేస్తూ యువతకు చేయూతనిస్తుంది. ముందు ఆమెను లైట్ అనుకుని తీసిపారేసిన ప్రధాన పార్టీలు.. శిరీషకు పెరిగిన ఆధరణ చూసి భయపడిపోతున్నాయి. ఈ క్రమంలో శిరీష మరో అడుగు ముందుకేసింది. స్వతంత్ర అభ్యర్థిగా తన మేనిఫెస్టోను ప్రకటించింది. నిరుద్యోగులే లక్ష్యంగా ఆమె తన మేనిఫెస్టోను రూపొందించింది. ఉద్యోగాల కల్పన, విద్యా, వైద్యానికి తన మేనిఫెస్టోలో పెద్దపీట వేసింది. ఏడు ప్రధాన అంశాలతో మేనిఫెస్టోను రూపొందించి ప్రధాన పార్టీలకు సవాల్ విసిరింది.

బర్రెలక్క మేనిఫెస్టో:

1. నిరుద్యోగుల అంశంపై అసెంబ్లీలో ప్రశ్నిస్తా. సరైన సమయంలో నోటిఫికేషన్లు వచ్చేలా చేస్తా.

2. పేదలకి ఇండ్ల నిర్మాణం కోసం కృషి చేస్తా.

3. ఆర్టికల్ 41 ప్రకారం నిరుద్యోగులకు భృతి ఇప్పిస్తా.

4. ప్రతి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు.

5. ఉచిత విద్య, వైద్యం కోసం పాటుపడుతా.

6. నిరుద్యోగులకు ప్రత్యేక కోర్సులు.

7. యువత ఉన్నత చదువులకు ఫ్రీ కోచింగ్.




Tags:    

Similar News