మిగిలిన ఆరుగురి పేర్లు ప్రకటించిన బీజేపీ

Byline :  Bharath
Update: 2023-11-10 03:07 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ చివరి తేదీ దగ్గరపడటంతో బీజేపీ మిగిలిన ఆరు స్థానాల అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. గురువారం (నవంబర్ 9) సాయంత్ర ఆరుస్థానాల్లో టికెట్ ఖరారు అయిన అభ్యర్థులకు ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ నాలుగు విడతల్లో మొత్తం 100 మంది అభ్యర్ధులను ప్రకటించిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా 8 స్థానాల్లో జనసేన పార్టీకి టికెట్ కేటాయించింది. మధిర, వికారాబాద్ , నర్సంపేట్, ఆలంపూర్, దేవరకద్ర, సికింద్రాబాద్ కంటోన్మెంట్, నాంపల్లి, శేరిలింగంపల్లి, మేడ్చల్, పెద్దపల్లి, రంగారెడ్డి స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. ఇవాళ్టితో నామినేషన్స్ దాఖలుకు గడువు ముగియనున్న నేపథ్యంలో ఉదయానికల్లా అభ్యర్ధులను అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ - కృష్ణ ప్రసాద్

నాంపల్లి - రాహుల్ చంద్ర

శేరిలింగంపల్లి - రవికుమార్ యాదవ్

మేడ్చల్ - రామచంద్రరావ

పెద్దపల్లి - ప్రదీప్ కుమార్.

రంగారెడ్డి - పులిమామిడి రాజు




Tags:    

Similar News