TS Assembly Elections 2023 : గజ్వేల్ ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటిది - ఈటల రాజేందర్

Byline :  Kiran
Update: 2023-10-26 09:54 GMT

గజ్వేల్‌లో ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. వర్గల్ సరస్వతీ దేవి ఆలయంలో పూజల అనంతరం నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లడిన ఆయన.. బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు బుద్ధి చెప్తారని ఈటల అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది మాత్రం బీజేపీయేనని ధీమా వ్యక్తం చేశారు.

గజ్వేల్లో బీజేపీ నిర్వహించే సమావేశాలకు ప్రజలను రాకుండా అడ్డుకుంటున్నారని ఈటల ఆరోపించారు. జనానికి దావతులు ఇచ్చి, పైసలు పంచి బీజేపీ సభలకు హాజరుకాకుండా చేస్తున్నారమని మండిపడ్డారు. హుజూరాబాద్ బై ఎలక్షన్ సమయంలోనూ ఇలాగే చేశారని ఈటల గుర్తు చేశారు. కానీ అక్కడి ఓటర్లు బీఆర్ఎస్ ప్రలోభాలు, డబ్బు పంపకాలకు పాతరేసి ధర్మం, న్యాయం వైపు నిలిచి ఉద్యమ బిడ్డను గెలిపించుకున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌లోనూ అదే జరుగుతుందని ఈటల ఆశాభావం వ్యక్తం చేశారు.




Tags:    

Similar News